నిరుపేదల పక్షన నిలిచి నవరత్నాల పథకాల ద్వారా పూర్తిస్థాయి సంక్షేమం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు అన్నారు. సోమవారం శంఖవరం మండంలోని వజ్రకూటం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్ర మాన్ని కార్యకర్తలు, వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రమే చేపట్టగలుగుతున్నారని అన్నారు. నిరుపేదలు, అక్క, చెల్ల మ్మల పక్షపాతిగా నిలిచిన జగనన్ననే మళ్లీ మళ్లీ మనం మన భవిష్యత్తుగా భావించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి ముం గిటే సమస్యల పరిష్కారం చూపిస్తున్న జగనన్నతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు స్వర్గయుగంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గృహసారధులు,కె.రమణ, కె.వెంకటరమణ, కీర్తి, నానాజీలు పాల్గొన్నారు.