సమ సమాజ స్థాపకుడు మహాత్మా జ్యోతీరావ్ పూలే
Ens Balu
31
Annavaram
2023-04-11 13:30:22
సమ సమాజ స్ధాపనకై అహర్నిశలు కృషి చేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి , రచయిత మహాత్మా జ్యోతిరావు పూలే అని శెట్టిబ త్తుల కుమార్ రాజా అ న్నారు. మంగళవారం అన్నవరం పెద్ద రావిచెట్టు సెంటర్ లో పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే అని కొనియాడారు. రైతు సమస్యలపై అమితాశక్తి ప్రదర్శించి వివిధ ప్రాంతాల్లో ఉద్యమించిన బహుజన సామాజిక విప్లవోద్యమ పితామహులు మహాత్మా జ్యోతి బాపూలే అని తెలిపారు. ఆయన సతీమణి సావిత్రి భాయ్ పూలే కూడా నిస్వార్థ సేవలం దించిన మహనీయురాలని వారిద్దరూ అమరజీవులుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనమి చ్చే నిజమైన ఘన నివాలి అన్నారు. వైస్ ఎంపీపీ దారారమణ, కొండపల్లి అప్పారావు బొబ్బిలి వెంకన్న పాల్గొన్నారు.