శారదాపీఠాన్ని సందర్శించిన దేవాదాయశాఖ కమిషనర్


Ens Balu
21
Pendurthi
2023-04-19 10:40:46

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ బుధవారం శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. ఇటీవలే కమి షన ర్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా విశాఖ వచ్చిన ఆయన విశాఖలోని పెందుర్తిలో గల పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వా త్మానందేంద్ర సరస్వతిలను మర్యాదపూర్వకంగా కలుసుకొని  అక్కడ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచ లంలో జరిగే చందనోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికాలరు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖ ఆధ్వ ర్యంలో ఉన్న ఆలయాలకు చెందిన మాన్యాలను, భూములను పరిరక్షించాలని కోరారు. ధార్మిక సలహా మండలి సమావేశాలను క్రమం తప్ప కుండా నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా ప్రముఖ ఆలయాల్లో జరిగే కార్యక్రమాలను భక్తులకు ముందుగానే తెలిసే విధంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ కు సూచించారు.