రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి


Ens Balu
10
Visakhapatnam
2023-04-20 16:22:13

విశాఖప కెజిహెచ్ కు ప్రతి రోజు చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు, వసతి అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున వైద్యధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కె జి హెచ్ ను ఆయన ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గైనిక్ వార్డును తని ఖీ చేసి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో పాటు వచ్చే సహా యకులు విశ్రాంతి తీసుకునే గదులను పరిశీలించారు. వారికి అందుతున్న సదుపాయాలపై ఆరాతీశారు. కె జి హెచ్ లో చేపడుతున్న పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రభుత్వం వైద్యసేవలకు ప్రభుత్వం పెద్ద పీటవేస్తుందని ఈ తరుణంలో ప్రభుత్వ వైద్యం కార్పోరేట్ వైద్యాన్ని మించి నిరుపేద రోగులకు అందాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో కె జి హెచ్ సూపరింటిండెంట్ డా.అశోక్ కుమార్, ఎపిఐడిసి ఇఇ నాయుడు, కె జి హెచ్ సిబ్బంది పాల్గొన్నారు.