జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం టాప్ 10లో నిలవడానికి కారణం బలోపేతమైన నాయకులు, సీఎం జగనన్నను నమ్మిన ప్రజలేనని ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎంపీపీ పర్వత రాజబాబు, కాకికినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, 4 మండలాల నాయకులు, గృహసారధులు, మండల కన్వీనర్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పిలుపుమేరకు 19 రోజులపాటు చేపట్టిన కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పంద వచ్చిందన్నారు. నియోజకవర్గంలో 80, 915 గృహాలను సందర్శించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న అడగమన్న 5 ప్రశ్నల ద్వారా ప్రజల సమాధానాలు స్వీకరించడంతోపాటు మద్దతుకూడా పొందామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు అభివృద్ధిని కూడా తెలియజేశామన్నారు.