ప్రత్తిపాడులో పర్వత నాయకత్వానికి తిరుగులేదు


Ens Balu
15
Sankhavaram
2023-04-24 07:23:15

ప్రత్తిపాడులోని ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రాసాద్ నాయకత్వానికి తిరుగులేదని కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వర్ధినీ డి సుజాత అన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఎమ్మెల్యే కార్యదీక్ష, కార్యకర్తలు, నాయకత్వం సహకారంతోనే ప్రత్తిపాడు నియోజకవర్గం జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం ను వ్వే జగనన్న కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో టాప్ 10గా నిలిచిందన్నారు. ఇదే స్పూర్తితో పనిచేసి మళ్లీ ఆయనను ఎ మ్మెల్యేగా నియోజవర్గానికి బహుమతిగా ఇవ్వాలని కేడర్ ను ఉత్సాహ పరిచారు. రాష్ట్రప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ఎమ్మెల్యే పర్వత దానిని అమలుచేసి ప్రజల్లోకి తీసుకెళ్లడంతో శక్తివంచన లేకుండా క  కృషి చేస్తారని కొనియాడారు. అలాంటి నాయకత్వం నియోజవకర్గ అభి వృద్ధికి చాలా అవసరమని అన్నారు. 4 మండలాల ఎంపీపీలు, గృహసారధులు కార్యకర్తలు పాల్గొన్నారు.