ప్రత్తిపాడు నియోజవకర్గంలో 3రోజుల సక్సెస్ మీట్


Ens Balu
24
Sankhavaram
2023-04-24 07:24:06

ప్రత్తిపాడు నియోజవకర్గంలో 3 రోజుల పాటు జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాలు వియవంతం చేసిన నాయ కులు, కార్యకర్తలు, సచివాలయ గృహసారధులతో కలిసి సక్సెట్ మీట్ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ తెలియ జేశారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎంపీపీ పర్వత రాజబాబు, కాకికినాడ జిల్లా మహిళా అధ్యక్షురా లు వర్ధినీడి సుజాత, 4 మండలాల నాయకులు, గృహసారధులు, మండల కన్వీనర్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభు త్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో చక్కగా తీసుకెళ్లిన క్యాడర్ ను ప్రత్యేకంగా గుర్తించాలని సన్మానించుకోవాలని ఈ కార్యక్రమం చేపడుతున్నారమన్నారు. 26న రౌతులపూడి, శంఖవరం మండలాలు, 27న ప్రత్తిపాడు మండలానికి అన్నవరంలోని ప్రైవేటు హోటల్ లో నూ, 28న ఏలేశ్వరం నగర పంచాయతీ, రూరల్ మండాల కేడర్ కే ఏలేశ్వరంలోనూ ఈ కార్యక్రమాలు ఏర్పాటుచేశామన్నారు.

సిఫార్సు