లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ పరిశీలించిన కమిషనర్


Ens Balu
5
Kakinada
2023-04-24 09:48:49

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల శుక్రవారం సంజయ్ నగర్ లోని డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని సందర్శిం చారు. ఎంహెచ్ఓ డాక్టర్ పృద్వి చరణ్,డిఈ మాధవి, ఇతర అధికారులతో కలిసి అక్కడకు వెళ్లిన కమిషనర్ లెగసీ వేస్ట్ ( ఎన్నో ఏళ్లుగా డం పింగ్ యార్డ్ లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్త )  ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు. యంత్రాల ద్వారా అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. దాదాపు 3,62,375 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రారంభిం చినట్లు డిఈ మాధవి కమిషనర్ కు వివరించారు. అంతకుముందు ప్రతాప్ నగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. మస్తరు కేంద్రాన్ని సందర్శించి  సిబ్బంది హాజరును పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరయ్యారో లేదో ఆరా తీశారు . ఆ ప్రాంతంలో కాలినడకన వెళుతూ చెత్త సేకరణ తీరు, డ్రైనేజీల నిర్వహణ, తడి-పొడి చెత్తను విభజించి ఇస్తున్న విధానాన్ని, కమిషనర్ తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న డీసిల్టేషన్ పనులను కూడా పరిశీలించారు. వర్షాలు పడే లోపుగా నగరంలోని అన్ని ప్రాంతాలలో పూడికతీత పను లు పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరై మెరు గైన పనితీరు కనబరిచేలా పర్యవేక్షించాలని ఎంహెచ్ఓ  డాక్టర్ పృద్వి చరణ్ ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట శానిటరీ ఇన్స్పె క్టర్లు, సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు.