విశాఖలోని శ్రీశ్రీ శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి(ఈఓ)గా కె.శిరీషా నియామకమయ్యారు. జిల్లా దేవాదాయ, ధర్మా దాయ శాఖాధికారిణిగా వున్న అసిస్టెంట్ కమిషనర్ శిరీషాను శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంకు ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కె.రమేష్‌నాయుడ్ని పెను గంచిప్రోలు, శ్రీతిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి (ఈఓ)గా బదిలీ చేసింది. అక్కడ ఈఓ(పూర్తి అదనపు బాధ్యతలు)గా వున్న అసిస్టెంట్ కమి షనర్ జీవీడీఎన్ లీలా కుమార్‌ను రిలీవ్ చేశారు. ఆయా ఈఓలు ప్రభుత్వం అదేశాల మేరకు తక్షణం బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. దానితో విశాఖలోని ఏసిగా ఉన్న శిరిష ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా దేవస్థాన సిబ్బం ది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు. అంతకు మందు ఈఓ అమ్మవారికి పూజలు చేశారు.