విశ్వమంతటికీ ఆదిశంకరులే జగద్గురువులు


Ens Balu
20
Pendurthi
2023-04-25 06:53:08

విశ్వమంతటికీ ఆదిశంకరాచార్యులు మాత్రమే జగద్గురువులు అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ప్ర పంచవ్యాప్తంగా సనాతన ధర్మం నేటికీ విరాజిల్లుతోందంటే అది ఆదిశంకరుల వారి గొప్పతనమేనని స్పష్టం చేసారు. శంకర జయం త్యుత్స వములను మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠంలో ఘనంగా నిర్వహించారు. ఆదిశంకరుల ప్రతిమకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి విశేష అభిషేకం నిర్వహించగా స్వరూపానందేంద్ర స్వామి మహా మంగళ హారతులిచ్చారు. పండితులంతా కలిసి ఉపనిషత్తులను పారాయణ చేసారు ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ, విగ్రహారాధనకు అతీతంగా పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసిన ఏకైక గురువు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారేనని తెలిపారు. శంకర సంప్రదాయాన్ని అనుసరిస్తున్న పీఠాల్లో విశాఖ శారదాపీఠం ప్రముఖ మైన దని చెప్పారు.  ఉపనిషత్తులు, వేదాంత ప్రచారం ద్వారా సనాతన ధర్మాన్ని నిలబెట్టారని వివరించారు.

సిఫార్సు