SEBదాడుల్లో 20లీటర్ల సారా స్వాధీనం, వాహనం సీజ్


Ens Balu
15
Prathipadu
2023-04-26 09:40:43

ప్రత్తిపాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్టు ఎస్ఈబీ ఇనెస్పెక్టర్ పి.అశోక్ తెలియజేశారు. ఈ మేరకు ప్రత్తిపాడులో ఆయన మీడియాకి వివరాలను వెల్లడించా రు. ఏలేశ్వరం నుంచి అడ్డతీగల వెల్లే దారిలో తనిఖీలు చేస్తుండగా స్ప్లెండర్ పై సారా రవాణా చేస్తూ కాకడ శ్రీను 10 లీటర్లతో పట్టుబడ్డాడని, కాగా  కేతనగిరి గ్రామంలో పూజల లోవమ్మ అనే మహిళ నుంచి 10లీటర్లు సారాతో పట్టుబడిందని పేర్కొన్నారు. వారి నుంచి సారాతోపాటు, ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు తెలియజేశారు. ఎవరైనా నాటు సారా తయారీ, వ్యాపారం, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని సిఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న దొర,  కానిస్టేబుల్స్ ఎల్.కృష్ణార్జున,  ఆర్.దొరబాబు, ఎ.రాజు, ఎ.సలామ్ ఖాన్, మహిళా కానిస్టేబుల్, కె.జ్యోతి పాల్గొన్నారు.



సిఫార్సు