అన్నవరంలో 50% టిక్కెట్లే ఆన్ లైన్ 50% ఆఫ్ లైన్


Ens Balu
31
Annavaram
2023-04-27 08:13:02

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో వసతి గదులను  దేవాదాయధర్మాదాయశాఖ వెబ్ సైట్ కి అనుసంధానించి ఆన్ లైన్ చేశారు. అ యితే ఇక్కడ కేవలం 50శాతం గదులు మాత్రమే ఆన్ లైన్ చేస్తున్నారు. మిగిలిన వాటిని ఆఫ్ లైన్ లోనే అందించాలని నిర్ణయించారు. తద్వారా అప్పటికప్పుడు వచ్చే భ క్తులకు సౌకర్యార్ధంగా వుంటుంది ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ చెబుతున్నారు. కాగా మొత్తం టిక్కెట్లలోని 70శాతం ఆన్ లైన్ చేయడం ద్వారా భక్తులకు సౌకర్యంగా వుంటుందనేది వివిధ వర్గాల నుంచి వస్తున డిమాండ్. ఆఫ్ లైన్ లో ఉంచేసిన 50శాతం టిక్కెట్ల వలన చాలా వరకూ మిగిలిపోయే అవకాశం కూడా లేకపోలేదని, పైగా ఇక్కడే తిష్టవేసుకుని కూర్చున్న దళారులను నియంత్రించడానికి అవకాశం లేకుండా పోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చూడాలి దేవస్థా నం అధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది..!