విశాఖలోని 92వ వార్డు గోపాలపట్నం బాపూజీ నగర్ లో వేంచేసి వున్న కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మతల్లికి ప్రతీకరమైన రోజు కావడంతో అమ్మవారిని వేపకొమ్మలు, పూలదండ లతో అలంకరించి తెల్లవారుజాము 5గంటల నుంచే పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పిడుగు మంగలక్ష్మి మాట్లాడుతూ, అమ్మవారిని నిత్యపూజలు ఆలయంలో జరుగుతుంటాయన్నారు. శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. ఆ సమయంలో భక్తులు పెద్దఎత్తున దుర్గమ్మకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. అదే సమయంలో తల్లికి ఇష్టమైన చిన్నారులకు ప్రత్యేక తీర్ధ ప్రసాదాల వితరణ కూడా జరుగుతుందని వివరించారు. ఒక్క విశాఖ మహానగరమే కాకుండా ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి కూడా పర్వదినాల్లో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ధర్మకర్త తెలియజేశారు.