ఈరోజుల్లో అందంగా పెంచుకున్న జుట్టుతో రకరకాల హెయిర్ స్టైల్ చేస్తుంటారు యువత.. కానీ ఆ యువకుడు మాత్రం పనిగట్టుకొని జుట్టు పెంచుకొని దానిని కేన్సర్ రోగులకు తయారు చేసే విగ్గులకు ఉచితంగా దానం చేస్తున్నాడు. ఆ యువకుడి పేరు గోపి వంశీక్రిష్ణ.. కాకినాడ జి ల్లా, శంఖవరం మండల కేంద్రం నివాసి.. చేసే పని గ్రామ సచివాలయ వాలంటీరు.. ఈ యువకుడికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అంటే ఎన లేని అభిమానం..ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అంటే అమితమైన గౌరవం..వారి స్పూర్తితోనే ఈ యువకుడు గత రెండేళ్లు గా తన జుట్టును దానం చేస్తూ వస్తున్నాడు. మరెందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు సీఎం వైఎస్ చేస్తున్న సంక్షేమ కార్యక్ర మాలంటే చాలా ఇష్టమని, ఆయనపై ఉన్న ప్రేమ గౌరవంతోనే తాను వాలంటీరుగా చేరి తనవంతు సేవలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. కే న్సర్ రోగుల విషయంలో ఒకసారి సీఎం జగనన్న చేసిన సూచన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని..నాటి నుంచి నేటి వరకూ 2 దఫాలుగా ఏడాది పాటు పెంచిన తన జుట్టును కేన్సర్ రోగుల కోసం ఇస్తున్నానని చెప్పాడు. ఇకపై కూడా తన శిరోజ దానసేవను కొనసాగి స్తానని, మనం ఏదో రూపంలో ఎదుటివారికి సేవగా నిలవాలన్నదే తన అభిమతమని చెప్పాడు. ఆడుతూ, పాడుతూ జీవితాన్ని సంతోషంగా గడిపే కాలంలోనూ కేన్సర్ రోగుల కోసం వంశీ చేస్తున్న సేవను గ్రామ సచివాలయ కార్యదర్శి శ్రీరామంచంద్రమూర్తి, జేఏబిసి రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, విఆర్వో సీతారాం, సర్వేయర్ సురేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు మెచ్చుకొని తమ సచివాలయంలో పనిచేసే వాలంటీరు చేస్తున్న సేవను అభినందించారు.