ఆర్థిక అసమానతలు లేని స్వేచ్ఛపూరితమైన, న్యాయబద్ధమైన సమాజాన్ని కోరుకున్న సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ అని గ్రంథాలయ విశ్రాం తి ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1818 మే 5న జర్మనీలో జన్మించిన కారల్ మార్క్స్ శ్రామికులకు మార్గద ర్శకుడు అని అన్నారు. పెట్టుబడి దారి నాగరికతలో కనీసం తిండి దొరకక బాధలు పడుతున్న ప్రజానీకానికి ఆయన సిద్ధాంతం ఒక ఆశాజ్యోతి వంటిదని అన్నారు. ఆర్థిక అంశాలు, సామాజిక జీవనానికి సంబంధించిన ఇతర విషయాలను ఆయన చెప్పినంత షూటిగా మరెవరు చెప్ప లేదని అన్నారు. ఆయన జీవితమంతా సమాజంలో నెలకొన్న వర్గ వైరుధ్యం, పెట్టుబడి దారి విధానం, సంపద యొక్క అసమాన పంపిణీకి వ్యతిరేకంగా సాగిందని అన్నారు. ఈ విషయాలపై ఆయన పలు రచనలు చేశారని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.