అన్నవరం ప్రసాదం కౌంటర్ లో ఫోన్ పే ఏర్పాటుచేయాలి
allada satya prasad
21
Annavaram
2023-05-12 06:55:04
అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ప్రసాదం కౌంటర్లలలో కొండపైనా, కొండదిగువన పాదాల మండపం వద్ద యూపీఐ, ఫోన్ పే కౌంటర్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఎక్కువ మంది స్వామివారి పాదాల మండపం, హైవేపే పై ఉన్న స్వామివారి రూప ఆలయం వద్ద ఫోన్ పే కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రసాదం అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయని చెబుతున్నారు. భక్తులు ప్రసాదాలు కొన్న నగదును నేరుగా ఖాతాలోకి దేవస్థానం అధికారులు ప్రతీరోజూ సాయంత్రం రెండు పర్యాయాలు జమచేస్తుంటరాని, యూపీఐ పేమెంట్ల ద్వారా ప్రసాదం అమ్మకాలు చేపడితే..నేరుగా ఆ మొత్తం దేవస్థానం బ్యాంకు ఖాతాల్లోకే చేరి సమయం కూడా కలిసివస్తుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం 60శాతం మంది భక్తులు యూపీఐ విధానం ద్వారా పేమెంట్లు చేస్తున్నందున.. ప్రసాదం కౌంటర్ల దగ్గర ఫోన్ పే, గుగూల్ పే, పేటిఎం తదితర యూపీఐ పేమెంట్ క్యూఆర్ కోడ్ స్కారన్లు ఏర్పాటు చేయడం ద్వారా త్వరగా ప్రసాదాలు కొనుగోలు చేసుకునేందుకు కూడా వీలు పడుతుందని, ఈ విషయంలో ఈఓ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.