చాన్నాళ్లకు ఆరిలోవ రిజర్వ్ ఫారెస్టు రోడ్డుకు మహర్ధశ
V.K.Mahesh
64
Golugonda
2023-05-15 09:42:24
గొలుగొండ మండల ప్రజల దశాబ్దాలకల, దీర్ఘకాలిక ఆరిలోవ రోడ్డు సమస్యకు శాస్వత పరిష్కారం లభించనుంది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ రూపుదిద్దుకోబోతున్నది. 7 దశాబ్దాలుగా ఎందరో ప్రజా ప్రతినిధులు, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు వెళుతున్నా, గొలుగొండ మండల పరిధిలోని ,ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న, 3 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ మాత్రం చేపట్ట లేకపోయారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికైన, పెట్ల ఉమా శంకర్ గణేష్ రోడ్డు విస్తరణ పనులకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చొరవతో తొలి అడుగు వేయబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్డు విస్తరణకు మార్కింగ్ ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ వెల్లడించారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, రోడ్లు భవనాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించి సత్వరమే పూర్తిచేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్డిఓ హెచ్ వి జయరాం, డీఎఫ్ఓ రాజారావు, రేంజర్ లక్ష్మి నర్సు , గోలుగొండ తాసిల్దార్ ప్రసాద్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.