జగన్ రెడ్డి దుష్ట పరిపాలనకు చరమగీతం పాడాలి..


allada satya prasad
26
Annavaram
2023-05-15 14:30:12

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి దుష్టపరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వరు పుల రాజాసత్యప్రభ పిలుపునిచ్చారు. సోమవారం అన్నవరంలో నారాలోకేష్ యువగళం కార్యక్రమానికి సంఘీభావంగా ఆమె గ్రామంలో పాద యాత్ర నిర్వహించారు. అంతకు ముందు తొలిపావంచా వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు తీరడంతోపాటు, రాష్ట్రం శుభిక్షంగా వుంటుందన్నారు. వరపుల రాజామన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానంటూ కన్నీటి పర్యంతం అయ్యా రు. కష్టకాలంలో నావెనుక నిలబడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని.. వరపుల రాజా మాదిరిగానే తాను కూడా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానని, నియోజకవర్గ ప్రజలు తనను మంచి మనసుతో దీవించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.