రాజన్న మన మధ్యలేరంటూనే కన్నీటి పర్యంతం


allada satya prasad
37
Annavaram
2023-05-15 15:03:06

కట్టుకున్న భర్త దూరమైన వెంటనే రాజకీయపగ్గాలు చేపట్టడమంటే అంత ఆషామాషీ కాదు..ఎంతో గుండై ధైర్యం, పార్టీ అండ, కార్యకర్తల సహకారం ఉంటే తప్పా కుదర దు. అయినప్పటికీ తాళికట్టిన భర్త జీవితం నుంచి శాస్వతంగా కనుమరుగైన విషయాన్ని దిగమింగి ప్రజల్లోకి రావడం కూడా ప్రత్యేకంగానే చూడాలి. ఎల్లప్పుడూ భర్తచాటు భార్యగా ఉన్న వరుపుల రాజాసత్యప్రభ ఆయన హాఠాత్మరణం తరువాత ప్రత్తిపాడు నియోజవర్గ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజలతో మమేకం అయి తిరుగుతున్నారు. సోమవారం అన్నవరం వచ్చిన ఆమె నారాలోకేష్ యువగళం కార్యక్రమానికి సంఘీభావంగా పాదయాత్ర చేసి, అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో వరుపులను తలచుకొని నడిరోడ్డుపైనే కన్నీటి పర్యంతం అయ్యారు. కష్టకాలంలో నావెంట ఉన్న ప్రతీ ఒక్కరినీ గుర్తుంచుకుంటానని, రాజా లేని లోటుని ప్రతీ కార్యకర్తకు, నాయకుడి వెంట నిలబడి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. తనను దీవించాలని, రాజాపై చూపిన అభిమానం తనపైనా చూపాలని కోరారు. రాజా పేరు వినపడిన ప్రతీ క్షణం ఆయన తన కళ్లముందే ఉంటారని, ఆయనే తనను ఈ విధంగా మీముందు నిలబెట్టారంటూ చేసిన ప్రశంగం అందరినీ ఆలోచింపజేసింది. భర్తను తలచుకుంటూ, చేసిన ప్రసంగం సభికులను, కార్యకర్తల హృదయాలు ద్రవించేలా చేసింది.

ఆరునెలల వరకూ బయటకు రాకూడదనుకున్నా కానీ పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రజలను దూరంగా ఉండలేక అంతటి బాధను దిగమింగుకొని మీ మధ్యకు వచ్చానని.. తనను మీ తోబుట్టువుగా అనుకొని సహకరించాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రాజా అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని, ఈసారి ఆయన అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అత్యధిక మెజార్టీతో రాజానే గెలిపించాననుకొని తనకు పట్టం కట్టాలని కోరారు. నియోజవవర్గంలోని ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని, పనిచేసిన ప్రతీ కార్యకర్తను, నాయకులను పేరు పేరుగా గుర్తించుకుంటానని హామీ ఇచ్చారు. సత్యప్రభ మాట్లాడుతున్నంతసేపూ రాజా అమర్ రహే..సత్యప్రభ నాయకత్వం వర్ధిల్లాలి, అధికారంలోకి వచ్చేది టిడిపినే అనే వాఖ్యాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలోటిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు