మరిడమ్మ అమ్మవారి చీరకు వెండి విరాళమివ్వండి


allada satya prasad
22
Annavaram
2023-05-16 09:14:22

కాకినాడ జిల్లా,అన్నవరం గ్రామంలోని(రైల్వే స్టేషన్ రోడ్డు) గ్రామ దేవత గా పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారికి త యారుచేయించే వెండి జెరీ చీరకు భక్తులు విరాళాలు ఇవ్వడానికి ముందుకి రావాలని ఆలయ కమిటీ నిర్వహాకులు బండారు రమణ కోరారు.  శ్రీఅమ్మవారికి ప్రతి సం వత్సరం వార్షిక జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా తల్లికి తయారు చేయించే ఈ వెండి చీర తయారీకి భక్తులు వారి శక్తి మేరకు పాల వెండి దానం చేయాలన్నారు. సదరు  చీర తయారు నిమిత్తం సుమారు 40 కిలోల వెండి అవసరం అవుతుందని. అన్నవరం గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న  శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మ వారికి అన్నవరం గ్రామ ఆడపడుచులు ప్రతి ఇంటికి 1లేక 2 తులముల పాల వెండిని విరాళంగా ఇవ్వడానికి ముందుకి రావాలని  శ్రీఅమ్మ వారికి సమర్పించే వెండి చీర తయారులో భాగస్వాములు అయి శ్రీ అమ్మవారి క్పప కుపాత్రలు కావాలని కోరారు. వివరాలకు ఆలయంలో సంప్రదించాలన్నారు.