శ్రీసత్యదేవ నిత్యన్నదాన ట్రస్టుకి రూ.100116 విరాళం


allada satya prasad
16
Annavaram
2023-05-17 07:50:23

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్య అన్నదానం ట్రస్టుకి విజయనవాడకికి చెందిన  పొట్లా వెంకటేశ్వర్రావు దంపతులు, రూ.100116 లు విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తం చెక్కును దేవాలయ సిబ్బం దికి గురువారం ఆలయ సిబ్బందికి అందజేశారు. వినాయక చవితి వెళ్లిన రెండవ రోజు పొట్టా కొత్త లక్ష్మీ కుమారి పేరుపూ అన్నదానం చేయాలని కోరారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ సిబ్బందికి దాతలకు ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.