కార్మికులను ఆర్థికంగా బలోపతం చేయడమే లక్ష్యం


Ens Balu
15
Visakhapatnam
2023-05-17 07:56:59

మహా విశాఖ నగరంలోని పారిశుద్ధ కార్మికులను ఆర్థికంగా బలోపతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం  5వ జోన్ తాటిచెట్లపాలెంలోని ఎం ఎస్ ఎఫ్ 5 లో నేషనల్ సేఫ్టీ సపాయికర్మాచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నమస్తే స్కీం ద్వారా పారిశుద్ధ కార్మికులకు జెసిబి లు, సెప్టిక్ ట్యాంకు వాహనాలను నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మలు అందించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ,  పారిశుద్ధ్య కార్మికులను ఆర్థికంగా బలోపతo చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఐదవ జోన్లో రెండు జెసిబి లు, ఒక సెప్టిక్ ట్యాంకును నమస్తే స్కీం ద్వారా కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సబ్సిడీపై అందించడం జరిగిందని తెలిపారు.  జోనల్ పరిధిలో ఒక్కొక్క వాహనానికి ఐదుగురు పారిశుద్ధ కార్మికులు గ్రూపుగా ఏర్పడి నిర్వహిస్తారని, ఈ వాహనాల్ని జీవీఎంసీ ప్రధాన గెడ్డలను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు.

 ఈ సబ్సిడీని ఏడు సంవత్సరాల పాటు జీవీఎంసీ చెల్లిస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా దళారులు కాంట్రాక్టర్లకు లబ్ధి  చేకూరకుండా నేరుగా పారిశుద్ధ కార్మికుడికే లబ్ధి పొందవచ్చని తద్వారా వారిని ఆర్థికంగా బలోపతo చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించారని ఆయన పరిపాలన త్వరలోనే ఇక్కడ నుండి కొనసాగుతుందని తద్వారా విశాఖ నగరం మరింత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే  జీవీఎంసీ పరిధిలో అన్ని జోన్ల కార్యాలయాలకు ఇటువంటి వాహనాలు సమకూర్చడం జరుగుతుందని అందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదరపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, ఏ ఎం ఓ హెచ్ రాజేష్, కార్యనిర్వహణ ఇంజనీర్ శ్రీనివాస్, విశాఖ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కోఆర్డినేటర్ సుదీర్, సానిటరీ సూపర్వైజర్ జనార్ధన్, సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.