మర్రిపాలెంలో ఫుట్ పాత్ అక్రమణాల తొలగింపు


Ens Balu
17
Visakhapatnam
2023-05-20 08:50:01

పాదాచారులకు అంతరాయం కలిగిస్తూ ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ మేరకు కంచరపాలెం మెట్టునుండి ఊర్వశి జంక్షన్ వరకు ఉన్నా  ఫుట్ పాత్ లు అలాగే కంచరపాలెం రైతు బజార్ రోడ్డు జాతీయ రహదారిపై తాటిచెట్ల పాలెం నుండి బర్మా క్యాంపు వరకు సర్వీసు రోడ్ లో ఉన్న ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని శుక్రవారం కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. పాదాచారులు వాహనదారులు వెళ్లేందుకు వీలు లేకుండా ఈ రోడ్లు ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు ట్రాఫిక్ సీ.ఐ మళ్ళ అప్పారావు దృష్టికి తీసుకురావడంతో ఎ.స్సై పాపారావు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుతో కలిసి ఈ డ్రైవ్ చేపట్టినట్టు సీ.ఐ తెలిపారు. ఇలా అక్రమాలు చేయడంతో పాదాచారులు, వాహన దారులు, అటుగా వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, పలు ప్రమాదాలకు దారి తీసే విధంగా ఉండటం వల్ల ఖాళీ చేయించినట్టు ఆయన తెలిపారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించేలా రోడ్డుకు అడ్డంగా ఉన్న తోపుడు బండ్లు, వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించామని తెలిపారు.