అచ్చుతాపురం గ్రామీణాబివ్రుద్దిలో విద్యార్దులను భాగస్వామ్యం చేసేందుకు ఉన్నత్ భారత్ అభియాన్ దోహదపడుతుందని ఉన్నత్ భారత్ అభియాన్ ఆంద్రాయూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ పావని తెలిపారు. బుదవారం మండలంలోని తంతడి గ్రామం లో చేతివ్రుత్తిదారులతో ఆమె మాట్లాడారు. ప్రశాంతి పాలిటెక్నిక్, ఆంద్రయూనివర్సిటీ ఆద్వర్యం లో Clay Craft (Pottery) మేకింగ్ ఇన్నోవేషన్ హబ్ ఎట్ తంతడి విలేజ్ అనకాపల్లి జిల్లా అనే అంశం పై ఉన్నత్ భారత్ అభియాన్ భారత ప్రభుత్వానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. గ్రామీణ కళలు, చేతి వ్రుత్తులను ప్రోత్సహించడానికి ఉన్నత్ భారత్ అభియాన్ పెద్దపీట వేస్తుందని, ప్రతి ఉన్నత విద్యాసంస్థ దీనిలో బాగస్వామ్యం అవ్వాలని ఆమె తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి ఉన్నతవిద్యా సంస్థ అయిదు గ్రామాలని దత్తత తీసుకుంటే ఆయా గ్రామాలో చేతివ్రుత్తులను ప్రోత్సహించడానికి నిధులు చేకూరతాయన్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావ్ ఎన్ఎస్ఎస్ అధికారిణి మాదవి, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.