10న ‘నరాల వ్యాధుల నివారణ`చికిత్స’ పై సదస్సు


Ens Balu
7
Anakapalle
2023-06-08 05:41:13

అనకాపల్లి శ్రీ గౌరీ గ్రంథాలయం 80 వార్షికోత్సవం సందర్భంగా ‘నరాల వ్యాధుల నివారణ చికిత్స’ (Prevention and Treatment of Neurological Diseases) అం శంపై శ్రీ గౌరీ గ్రంథాలయంలో ఈ నెల 10వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు సదస్సు జరుగుతుందని  గ్రంథాలయ కార్యదర్శి  కాండ్రేగుల వెంకటరమణ ఒక ప్రకట నలో తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా అంతర్జాతీయ న్యూరో సర్జరీ నిపుణులు, ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందిన బెంగుళూరులోని కేంద్ర ప్రభుత్వ నిమ్‌హేన్స్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సస్‌) ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగం పూర్వపు ప్రధాన అధిపతి డా.ఎం.భాస్కరరావు హాజరవుతారు. నరాల వ్యాధుల నివారణ`చికిత్స, మందుల ద్వారా తగ్గని పిట్స్‌ వ్యాధి (Epilepsy Surgery), మతిమరుపు, బ్రెయిన్‌ టూమర్‌ (మెదడులో కణితులు), పక్షవాతం ఇంకా మెద డుకు సంబంధించిన వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సదస్సులో చర్చిస్తారని పేర్కొన్నారు. సదస్సుకు యువతీయువకులు, విద్యార్ధులు, వైద్యులు, స్వచ్ఛం ద సంస్ధల ప్రతినిధులంతా  హాజరు కావాలని ఆయన కోరారు