దౌర్జన్యానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి


Ens Balu
20
Visakhapatnam
2023-06-08 11:12:49

వాల్తేరు రైల్వే డివిజనల్ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ విజయ్ కుమార్ పై దౌర్జన్యానికి పాల్పడి కుల ధూషణకు దిగిన రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని విప్ల వ దళిత సంఘ నేతలు డిమాండ్ చేశారు. గురువారం అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ, కుల ధూషణలకు పాల్పడిన డాక్ట ర్ కాశీపతి, మహేష్ కుమార్, లక్ష్మణరావులను తక్షణమే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. గత మాసం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్ర మా లు చేపట్టినా వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. అందుకే భవిష్యత్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేప ట్టేం దు కు ప్రణాళికలను సిద్దం చేస్తున్నామన్నారు. వాల్తేరు రైల్వే అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధితుల అక్రమ బదిలీలను వెం టనే ఉపసంహరించి వారికి గతంలో పనిచేసే చోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు కొల్లాబత్తుల వెంగళరావుతో పాటు జిల్లా, నగర నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.