కాకినాడ జిల్లా శంఖవరం మండల పరిషత్ డెవలెప్ మెంట్ అధికారిగా జి.శివరామక్రిష్ణయ్య నియమితులయ్యారు. ఈయన మామిడికుదురులో ఈఓపీఆర్డీగా విధులు నిర్వహించేవారు. పదోన్నతిపై శంఖవరం ఎంపిడీఓగా వచ్చారు. ఈరోజు ఆయన విధుల్లోకి చేరారు. శివరామక్రిష్ణయ్య విధినిర్వహణలో ముక్కుసూటి అధికారిగా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారనే మంచిపేరు ఈయనకు ఉంది. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు. పలువురు సచివాలయ కార్యదర్శిలు, సిబ్బంది కూడా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, మండలంలో ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ లక్ష్యం మేరకు చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు. త్వరలోనే మండంలోని అన్ని సచివాలయాలు పర్యటిస్తానని చెప్పారు.