శంఖవరంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ జి.శివరామక్రిష్ణయ్య ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా ఎంపీపీ పర్వత రాజబాబును కూడా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మండలాన్ని అభివ్రుద్ధి పధంలో నడిపించాలనే ఎమ్మెల్యే సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకి వెళతానన్నారు. దశలవారీగా మండలంలోని అన్ని పంచాయతీలు, గ్రామసచివాలయాలను సందర్శించి అక్కడ ప్రధాన సమస్యల పరిష్కరించడానికి క్రుషిచేస్తానని అన్నారు. మంచి వాతావరణం కలిగిన ప్రాంతానికి పదోన్నతి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, మీడియా సహకారంతో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు సిబ్బందితో కార్యాచరణ రూపొందిస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటాననని చెప్పిన ఎంపీడిఓ ప్రజలు ఎప్పు డైనా తనను కలవడానికి నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి రావొచ్చునన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది సేవల్లో ఎక్కడ లోపాలు ఉన్నా తనకు తెలియజే వచ్చు న న్నారు.