జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 14 నుంచి నిర్వహించనున్న వారాహి యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్రకార్యదర్శి చిలకం మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోజు పవన కళ్యాణ్ స్వామవారిని దర్శించుకుని అన్నవరం నుంచే యాత్ర ప్రారంభిస్తారని.. ఈ కార్యక్రమానికి జనసే నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఇప్పటికే తమ అధినేత పర్యటన ఖరారు అయినందున జిల్లాతోపాటు, అన్ని నియోజకవర్గాలు, దారిపొడవునా ఉన్న గ్రామాల్లోని జనసేన కార్యకర్తలకు వర్తమానం పంపినట్టు తెలియజేశారు. యాత్ర ప్రారంభం అయిన దగ్గర నుంచి ఏఏ గ్రామాల మీదుగా వారాహి ప్రయాణిస్తుందో మొత్తం టూర్ షెడ్యూలు నియోజవకర్గాల వారీగా ప్రకటించారని పేర్కొన్నార. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ తమ్మయ్య బాబు అక్కల గాంధీ కరణం సుబ్రహ్మణ్యం నల్ల రామకృష్ణ గాబు బండారు రామారావు మరియు జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.