అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఏకాదశి పర్వదినం నుంచి ప్రతీరోజూ సాయంత్రం 4.30 గంటల నుండి 6.00 గంటల వరకూ విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. ఈమేరకు ఆదివారం అన్నవరంలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు. వైదిక కమిటీ సూచనల ప్రకారం వీటిని నిర్వహిస్తుననట్టు పేర్కొన్నారు. ఆశక్తి కలిగిన భక్తులు ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొనాలంటే ముందుగా పీఆర్వో విభాగంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీఏటా మాదిరిగానే, ఈఏడాది కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని దేవస్థాన అధికారులు కోరారు.