విశాఖపట్నంజిల్లా, నగరం పరిధిలోని క్రైస్తవ సేవా సంస్థలకు ఆస్తి పన్ను రద్దు చేయాలని డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాల సంయుక్తంగా, ఆంధ్ర ప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీని అభ్యర్ధించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో కలిసి లాభాపేక్ష లేకుండా నడుపుతున్న క్రిస్టియన్ మైనారిటీ కి సంబంధించిన చారిటీల సంస్థలకు ఆస్తి పన్ను తగ్గించాలన్నారు. అవకాశం ఉంటే పూర్తిగా మాఫీ చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈమేరకు ప్రత్యకంగా వినతి పత్రాలను అందించారు. వారి వినతిపై చైర్మన్ జాన్ వెస్లీ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని జాన్ వెస్లీ చెప్పినట్లు ఆయా సంస్థలు మీడియాకి తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్ జాన్ ప్రకాష్, ఫాదర్ సుధాకర్, ప్రిన్సిపల్ సిస్టర్ ప్రేమ, సిస్టర్ రెజీ తదితరులు పాల్గొన్నారు.