ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తూ మంత్రివర్గ సమావేశంలో సీఎం. జగన్మోహన్ రెడ్డి ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తారువాలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు సమక్షంలో సీఎం.జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇందుకు సహకరించిన ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ఆర్.శర్మ మాట్లాడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారికి తమ కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ఆర్.శర్మ, అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, అప్పారావు, పార్థసారథి, రామకోటి, కోటేశ్వరరావు, లక్ష్మణరావు, రమణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.