1990 బ్యాచ్ క్రిష్ణదేవిపేట పూర్వ విద్యార్ధుల దాత్రుత్వం


Ens Balu
395
Lambasingi
2023-06-11 15:36:08

వాళ్లంతా ఏఎల్ పురం జిల్లా పరిషత్ హైస్కూలులో 1990-91 బ్యాచ్ 10వ తరగతిలోని పూర్వవిద్యార్ధులు ఏడాది క్రితం అంతా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకు న్నారు. ఆ తరువాత ప్రతీ ఏడాది ఏదోఒక ప్రాంతంలో కలుసుకోవాలని నిర్ణయించుకుని వారి వారి శుభకార్యాలకు హాజరవుతూ వస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారా మరాజు పాడేరు జిల్లా, చింతపల్లి మండలం లంబసింగి పర్యాటక ప్రాంతంలో మళ్లీ ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు. ఎంతో సరదాగా గడిపారు. కలవడం సరదాగానే అయినా వారి సహచర విద్యార్ధులు కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి వారికి తమవంతు సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. వారితో కలిసి చదవుకున్న స్నేహితుల్లో ఒకరికి పక్షవాతం రావడంతో స్నేహితుడికి రూ.4వేలు.. ప్రమాదంలో చేయి విరిగిపోయిన మరో స్నేహితుడికి రూ.2వేలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం అందించారు. గత ఏడాది ఇదే బ్యాచ్ లోని స్నేహితురాలి ఇల్లు కాలిపోవడంతో ఆమెకు రూ.30వేలు ఆర్ధిక సహాయం చేశారు. ఇలా ఒకరికి ఒకరు మేమున్నామంటూ భరోసా ఇచ్చుకుని ముందుకి సాగుతున్నారు.ఈనాటి కార్యక్రమంలో సుమారు 50మంది పూర్వవిద్యార్ధులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర ఐదు గంటల వరకూ అక్కడే ఉండి సరదాగా గడిపారు. ఈ ఆత్మీక కలయికకు పైల చంద్రశేఖర్, బెన్నయ్యనాయుడు, భాస్కర్రావు సంధాన కర్తలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించారు.