జనసేన వారాహి యాత్రను జయప్రదం చేయండి


Ens Balu
13
Golugonda
2023-06-12 07:56:05

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను జయప్రదం చేయాలని అరకు పార్లమెంట్ ఇంచార్జ్, నర్సీపట్నం వారాహి యాత్ర సమన్వయకర్త వంపూరి గంగులయ్య పిలుపునిచ్చారు. సోమవారం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో గొలుగొండలో వారాహి రధయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సంక్షేమం పేరుతో సంక్షోభం వైపు అడుగులేస్తున్న ప్రభుత్వ విధానాలను పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరిస్తారన్నారు. పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర ప్రత్యర్థులపై పారాటయాత్ర అన్నారు. ఈ యాత్రను నర్సీపట్నం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు జయప్రదం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ. అధికారంలోకి రావడానికి అందరూ శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, సీనియర్ నాయకులు రేగుబళ్ల శివ, సలాదుల ప్రసాద్, ఎస్సీ సెల్ బోయిన చిరంజీవి, కోన నారాయణరావు, వాసం వెంకటేష్, వూడి చక్రవర్తి, కేడీపేట ఉప సర్పంచ్ దుంపలపుడు సహదేవుడు లింగంపేట ఉపసర్పంచ్ లంకసత్యనారాయణ నాతవరం మండలం నాయకులు వెంకటరమణ, పాలుపర్తి సూరిబాబు, బంగారు నాయుడు జన సైనికులు  పాల్గొన్నారు.