జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈనెల 14న చేపట్టనున్న వారాహి యాత్రను జయప్రదం చేయాలని యలమంచిలి యాత్ర ఇన్చార్జి కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షులు బం డ్రెడ్డి రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్ పిలుపునిచ్చారు. ఎలమంచిలి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజ య్ కుమార్ అధ్యక్షతన జనసైనికులతో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధి నుండి ప్రారంభం అవుతుందని.. అదే రోజు కత్తిపూడి లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఈ యొక్క బహిరంగ సభకు నియోజకవర్గంలో గల జనసైని కులు వీర మహిళలు అత్యధికంగా తరలిరావాలని కోరారు. అనంతరం వారాహి యాత్రకు సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు. ఈసమావేశంలో జనపరెడ్డి శ్రీనివా సరావు, బైలపూడి శ్రీరామదాసు, లాలం చందు, పప్పల నూకన్న దొర, పైల రాము నాయుడు, కాళ్ళ చంద్రమోహన్, చొప్ప శ్రీను, పొట్నూరి శివశంకర్, బొద్ధపు శ్రీనివాస రావు, లాలం సోమనాయుడు, పవన్ విజయ్, నియోజవర్గపు జనసేన నాయకులు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.