సీఎం జగన్ విద్యకు పెద్దపీట వేసి అభివ్రుద్ధిచేస్తున్నారు


Ens Balu
11
Paravada
2023-06-12 12:31:03

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి విద్యకు పెద్దపీట వేసి కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను అభివ్రుద్ధి చేస్తున్నారని వైఎస్సార్సీపీ సిఇసి నాయకులు పైలశ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం పరవాడలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, వసతి దీవెనపథకాల ద్వారా  సీఎం పేద పిల్లల విద్యోన్నతికి పాటుపడుతున్నారన్నారు. అందులో భాగంగానే విద్యార్థుల కోసం మన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం జగనన్న విద్య కానుకను నిర్విరామంగా కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కా రామునాయుడు, పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పల నాయుడు,  పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు చిన్నారవు, తదితరులు పాల్గొన్నారు.