వైఎస్సార్సీపీ మోసాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు


Ens Balu
4
Visakhapatnam
2023-06-13 08:35:19

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలన సందర్భంగా ఆదివారం విశాఖ లో నిర్వహించిన సభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టమైన రాష్ట్ర రాజకీయాల పై మాట్లాడారని దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం లేదని రాజ్య సభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు అన్నారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం రాత్రులు పగలు తేడా లేకుండా కరెంటు కోతలు విధిస్తున్నారని దీనిపై వెంటనే చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందేలా ప్రభుత్వం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ,  జాతీయ నాయకులకు అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి అక్కడి సమస్యల పై మాట్లాడే హక్కు ఉంటుందని ఈ క్రమం లొనే ఆదివారం అమిత్ షా సభ 4 ఏళ్ల తర్వాత విశాఖలో నిర్వహించామని ఈ సభ కు 40 వేల మంది ప్రజలు హాజరై విజయవంతం చేసారన్నారు. 

ఇక ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే గడిచిన 9 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా 15 జాతీయ విద్య సంస్థలను నెలకొల్పమన్నారు. ఈ నెల 20 నుండి 30 వరకు రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి గతంలో 9 ఏళ్ల లో చేసిన అభివృద్ధిని వివరిస్తామని అంతేకాకుండా జాతీయ రహదారుల 4000 కిలోమీటర్ల నుండి 9000 కిలోమీటర్లకు అభివృద్ధి చేసి 3 లక్షల కోట్లు వెచ్చించడం జరిగిందని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో రాష్ట్ర మంత్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

 బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో భూ కుంభ కోణాలు తీవ్రంగా పెరిగాయని రెండుసార్లు   సిట్ ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేయకుండా భూకబ్జాదారులను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కాపాడుతుందని రానున్న ఎన్నికల్లో ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసి బయటపెడతామని అన్నారు.  నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తూ బిజెపి ప్రభుత్వం ఏనాడూ వైఎస్ఆర్సీపీకి అండగా లేదని బిజెపి అండ్ తమకు ఉందని వైయస్సార్సీపి మరియు జగన్మోహన్ రెడ్డి భ్రమ పడుతున్నారని అని వ్యాఖ్యానించారు అదేవిధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు మానుకోవాలని ఆయన హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులకు సంక్షేమ పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని కిసాన్ సమాన్ పేరుతో రైతులకు ప్రతి ఏటా ఆరువేల రూపాయలు కేంద్రం ఇస్తుంటే దానిని రైతు భరోసా పేరుతో ప్రభుత్వం పథకం కింద చలామణి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.  ఈ నెల 10వ తారీఖున రాజకీయ వేట మొదలైందని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన పై ఉక్కు పాదం మోపి ఏవిధంగా బిజెపి ముందుకు వెళుతుందని రాష్ట్రంలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతుంటే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ప్రముఖ ఐటీ అసోసియేషన్కు ప్రతినిధిగా ఉన్నానని విశాఖకు ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదని ఐటీ కంపెనీలు తీసుకొస్తామని పేరుతో రాష్ట్ర ప్రజలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాద్ మోసం చేస్తున్నారన్నారు.

 అంతేకాకుండా మీడియా సంస్థలపై దాడి దాడికి పూనుకున్నారని కొన్నింటికి మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. మార్గదర్శిపై ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకపోయినా కక్ష సాధింపు చర్యలకు దిగారని రామోజీరావు మరియు, శైలజలను మానసికంగా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముడుపులు చెల్లించలేక అమర్ రాజా కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయిందని  రాష్ట్రం ఒక పక్క అప్పుల ఊబిలో కూరుకు పోతుంటే జగన్ మోహన్ రెడ్డి అపర కుబేరుడు అవుతున్నాడని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి ధానేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.