అనకాపల్లి మండలం శంకరంలో గల బొజ్జన్న కొండ అభివృద్ధి కాకపోవడానికి ఎంపీ భీశెట్టి సత్యవతి, మంత్రి గుడివాడ అమర్నాథ్ లే కారణమని మాజీ ఎమ్మెల్యే, నియోజ కవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన బొజ్జకొండ దగ్గర నుంచి ఎంపీ, మంత్రులకు సెల్ఫి ఛాలెంజ్ విసి రారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి అమర్నాథ్ కు పబ్లిసిటీ తప్పా అభివృద్ధి ఎలా చేయాలో తెలియదన్నారు.వైఎస్సీర్సీపికి ప్రెస్ మీట్లు పెట్టడానికే ఈ నాలుగేళ్లు సరిపోయిందని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో బొజ్జన్నకొండ అభివృద్ధి కి ఏడు కోట్లు మంజూరయ్యాయన్న ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంత అభివ్రుద్ధికి పర్యాటక ప్రాంతాలను అభివ్రుద్ధి చేయడానికి ఏం చేశారో చెప్పాలన్నారు. వీరంతా నియోజవకర్గంలో గెలిచి కార్యక్రమాలన్నీ విశాఖలో చేస్తే..ఓట్లేసిన ప్రజలకు ఏం మేలు చేయగలరని.. నాయకుండే ప్రజలకు అందుబాటులో ఉండి నియోజవకర్గాలను అభివ్రుధ్ధి చేసినవాడేనన్నారు.