జనసేన అధికానేత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్న వారాహి యాత్ర అన్నవరం నుంచి ప్రారంభమై 9 నియోజకవర్గాల్లో పదిరోజులు సాగి చివరికి భీమవరం చేరుకుంటుంది. తొలిరోజు సత్యదేవుని పాదాల చెంత పూజలు పూర్తిచేసుకొని మొదటి సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో బహిరంగ సభ జరుగుతుంది. తరువాత రూట్ మ్యాప్ వారీగా సమావేశాలు నిర్వహించుకుంటూ వారాహి యాత్ర సాగుతుంది. ఎన్నికలకు సుమారు ఎనిమిది నెలలు సమయం ఉండగా నే జనసేన పార్టీ చేపడుతున్న వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయవర్గాల్లో కాక నింపారు. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం చాలా కార్యక్రమాలకు ప్రారంభా లకు సెంటిమెంట్..అదే సెంటిమెంటును జనసేన కూడా వినియోగించుకొని ఈరోజు యాత్ర ప్రారంభిస్తున్నది. ఈ నేపథ్యంలో జనసైనికులు కూడా భారీ ఎత్తున అన్నవరం చేరుకుంటున్నారు. సాయంత్రం జరిగే సభలో ఏం మాట్లాడతారనేది ఇప్పటి నుంచే ఉత్కంఠగా మారింది..!