“మత్తు” మహమ్మారిని పారద్రోలండి - ఎస్ఐ జె.సురేష్


Ens Balu
80
Pendurthi
2023-06-17 17:03:07

యువతను మత్తులో ముంచేత్తుతూ, వారి భవితకు పరిణమిస్తున్న మాదకద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ  జె.సురేష్ అన్నారు. ఈనెల 26న మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని శనివారం పురుషోత్తపురం, హెచ్.పీ కాలనీలోని కంఫర్ట్ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగ ణంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన నివాసితుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ విశాఖపట్నం డ్రగ్ వినియోగంలో, రవాణాలో ప్రముఖంగా విచారకరమన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో మార్పును ఉండాలని, ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వారి గమనాన్ని మనం నిర్దేశించగలమన్నారు. డ్రగ్ వ్యాపారులు యువతను టార్గెట్ చేసుకుని తమ వ్యాపారం విస్తృతం చేసుకునే విధానాన్ని వివరించారు. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలిగొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు అన్నారు. ఆరోగ్యానికి హానికరమైన డ్రగ్స్ వాడినా, అమ్మినా చట్టపరంగా నేరమన్నారు. ఈ  నేరగాళ్ళ భరతం పట్టేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు.14 500 ఫోన్ ద్వారా వారి ఉనికిని తమకు తెలియపరచాలన్నారు. సచివాలయంలో పోలీస్ విధులు నిర్వహిస్తున్న రత్నం, ప్రసన్న మాట్లాడుతూ  ఆన్ లైన్ మోసాలకు గురవుతున్న నగర ప్రజలు, బోగస్ ఫైనాన్స్ సంస్థల పట్ల అప్రమత్తం కావాలని సూచించారు. కంఫర్ట్ హోమ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వివి రమణమూర్తి, ఎంఎస్ శ్రీనివాసు, కేడిఆర్ రెడ్డి, ఏవి నాగభూషణరావు, వి ఉమామహేశ్వరరావు, బిటి రావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.