టీడీపీ విజయంతోనే యువతకు న్యాయం.. గంటా రవితేజ


Ens Balu
12
nellore
2023-07-03 09:36:56

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని, అప్పుడే యువతకు తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని ఆ పార్టీ యువనేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు, మరో మాజీ మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ అన్నారు.. యువగళం పాదయాత్రలో భాగమై.. అనంతరం నెల్లూరులో నారా లోకేష్‌తో రవితేజ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ యువతకు అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోందన్నారు.. నిరుద్యోగ సమస్యకు చెక్‌ చెప్పి.. ఉద్యోగావకాశాలు పెరగాలంటే అదొక్క టీడీపీతోనే సాధ్యమన్నారు. యువతకు నిరుద్యోగ భృతి అందించిన ఒకే ఒక్క పార్టీ టీడీపీయేనని చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో యువతకు అధిక సీట్లు కేటాయించే అవకాశముందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. తగిన ఉద్యోగావకాశాలు కరువై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు యువత కృషి చేయాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. యువతీయువకులంతా సంఘటితంగా టీడీపీకి మద్దతు పలికి.. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపించాలని విజ్ఞప్తి చేశారు.