విశాఖజిల్లాలో జగనన్న కాలనీ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున సంబంధిత శాఖల అధికారులు , గుత్తేదారులని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని జగనన్న లేఅవుట్ల ఇళ్ల నిర్మాణంపై వెబెక్స్ ద్వారా జిల్లాలోని ఎస్ఈ లు , డీఈలు, ఏఈలు , జివిఎంసి , అన్ని మండలాల ఎంపిడిఓలు , గుత్తేదారులతో తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇళ్ల నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సమీక్షలో పాల్గొన్న అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గుత్తేదారు వారీగా సమీక్ష నిర్వహించారు. బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న గృహాలన్నీ బేస్మెంట్ స్థాయికి తీసుకు రావాలన్నారు.
బేస్మెంట్ లెవెల్ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న గృహాలన్నీ రూప్ క్యాస్టింగ్ స్థాయికి తీసుకురావాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి స్టేజి అప్డేషన్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్ లను లేఅవుట్లకు ఎప్పటికప్పుడు సరఫరా చేసేలా చూడాలని, సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి పనిచేయాలన్నారు .
ఈ వెబెక్స్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ , హోసింగ్ పిడి శ్రీనివాసరావు , వి ఎం అర్ డి ఎ అధికారులు , ఈపీడీసీఎల్ , మండల పరిధిలోని ఎంపీడీఓ లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.