కేంద్రప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన సెల్ ఫోన్ టవర్లను సత్వరమే పూర్తిచేసి గిరిజ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను మెరుగు పరచాలని అరకు ఎంపి గొడ్డేటి మాధవి కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సమాచార వ్యవస్థ, ఇబ్బందులను వివరించారు. అల్లూరి సీతారమరాజు జిల్లాలోని అరకు, మన్యం పార్వతీపురం జిల్లాలలో ప్రధానంగా నెలకొన్న పలు రైల్వే సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సెల్ టవర్లు, రైల్వే పనులకు సంబంధిచి ప్రత్యేకంగా వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో నేటికీ సెల్ ఫోన్లు సైతం పనిచేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా చాలాచోట్ల సెల్ టవర్ల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.