జాతీయ రహదారికి అనుకొని వున్న హోటళ్లు, దాబాలు నిర్ణీత సమయానికి ప్రతీరోజూ మూసివేయాలరి నక్కపల్లి సిఐ జి.అప్పన్న సూచించారు. నక్కపల్లి సర్కిల్ పరిధి లో ఉన్న హోటళ్లు , దాబాల యజమానులతో బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు రాత్రి పదిగంటలకల్లా హోటళ్లు , దాబాలు మూసివేయాలన్నారు. హోటళ్ల లో ఎవరైనా కూర్చుని మద్యం సేవించినా.. గొడవలకు దిగినా యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. అంతేకాకుండా కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. హైవే డాబాలు పక్కన ఎవరైనా వాహనాలు ఆపిన సమయంలో ప్రమాదాలు జరిగితే దానికి సదరు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాదరావుతోపాటు సిబ్బంది, పలు హోటళ్ల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.