బూదరాళ్ల రహదారిలో ముమ్మరంగా పోలీస్ తనిఖీలు


Ens Balu
18
Koyyuru
2023-07-26 16:12:36

ఆంధ్రా ఒడిసా సరిహద్దు ప్రాంతంలో ఈనెల జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. అడువులు, సరిహద్దు ప్రాంతాలు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల వారోత్సవాల నియంత్రణ చర్యల్లో భాగంగా బుధవారం కొయ్యూరు సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో  కొయ్యూరు ఎస్ఐ రాజారావు, మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తమ పోలీస్ సిబ్బందితో అటవీప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బూదరాళ్ల రోడ్డులో గుడ్లపల్లి, మర్రివాడ,  తదితర పరిసర ప్రాంతాలలో ఏరియా డామినేషన్ నిర్వహించారు. అనుమానస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఏజెన్సీలోని నైట్ హాల్ట్ ఆర్టీసి సర్వీసులను పోలీస్ స్టేషన్ల వద్దే నిలుపుదల చేస్తున్నారు.