అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ దేవాదావశాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం ఈ మేరకు అన్నవరం వచ్చిన ఆయనకు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంతరాయలయంలో సత్యదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కమిషనర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఈఓ స్వామి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.