పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా గుర్తించి ముందడువేయాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ఐఏఎస్ అధికారుల భార్యల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నవరం శ్రీ సత్యదేవ మారేడు వనంలో మారేడు, జమ్మి, సంపంగి, తులసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణంలో జరుగుతున్న విపరీత మార్పుల వలన సకాలంలో వర్షాలు కురవడం లేదని, అలాగే భూగర్భ జాలాలు అడుగంటులున్నాయ, ఎండల తీవ్రత పెరిగి హిమాలయాలు కరిగిపోవడం, కాలుష్యం పెరిగుదల జరుగుతున్నాయన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే మొక్కలను విరివిగా పెంచాలన్నారు. ప్రతీఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచి ఉష్టోగ్రతల నియంత్రకు క్రుషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ చంద్రశేఖర ఆజాద్ సిబ్బంది పాల్గొన్నారు.