అన్నవరం పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ వర్తింపు
SatyaPrasad.Allada
61
Annavaram
2023-08-01 10:46:32
అన్నవరం పంచాయతీలోని పారిశుధ్య కార్మికులకు ఈఎస్ఐ వర్తింపు వలన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులను అదిగమించడానికి అవకాశం వుంటుందని సర్పంచ్ ఎస్.కుమార్ రాజా పేర్కొన్నారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పంచాయతీకార్మికులు ఈఎస్ఐ ద్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ, ఇప్పటికే పారిశుధ్య కార్మికులకు పిఎఫ్ అమలు జరుగుతుందని..నేటి నుంచి ఈఎస్ఐ ప్రయోజనం కూడా కలుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో ఒక్క అన్నవరం పంచాయతీలో మాత్రమే కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించినట్టు ఆయన తెలియజేశారు. తద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.