గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులుగా పనిచేస్తున్న తమను మాత్రుశాఖ పోలీసుశాఖలోనే కొనసాగించేలా చూడాలని సచివాలయ మహిళా పోలీసులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని రజనీని కలిసి వేడుకున్నారు. గురువారం చిలకలూరిపేట నియోజక వర్గంలోని క్యాంపు కార్యాలయంలో చిలకలూరిపేట అర్బన్, రూరల్, నాదెండ్ల మహిళా పోలీస్ లు సంయుక్తంగా తమ సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. మహిళా పోలీసులకి సరైన జాబ్ చార్ట్ లేనందున అనేకమైన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. లైన్ డిపార్ట్మెంట్ లేనందున సమస్యలు ఎదుర్కొంటున్నామని..తనుహోం డిపార్ట్మెంట్ లోనే కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమవిధులకు ఎలాంటి ఆటంకం లేకుండా పటిష్ఠమైన మహిళా పోలీస్ చట్టం తీసుకురావాలని కోరారు. మహిళా పోలీసుల సమస్యలపై స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం వైఎస్.జగన్ మోహనరెడ్డి ద్రుష్టికి తీసుకెళతానని చెప్పారు.