తూటిపాలలో ఘనంగా చేనేత దినోత్సవం


Ens Balu
41
Makavarapalem
2023-08-07 08:24:00

మాకవరపాలెం మండలంలోని తూటిపాల ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపా ధ్యాయులు కోసూరు రాము ఉపాధ్యాయిని  సంతోషి, స్థానిక ఆరోగ్య కార్యకర్త, ముగ్గురు విద్యార్థులు చేనేత వస్త్రాలు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. పీఎం నరేంద్ర మోడీ సూచనల మేరకు తొమ్మిదవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు చేనేత వస్త్రాలు  ప్రాముఖ్యతను వివరించారు. నూలు వడకడము, రాట్నం, దారము ప్రాధాన్యతను  చేనేత కార్మికుడు నూకరాజు  విద్యార్థులకు వివరించారు. గాంధీ నూలు వడకడము జీవితాంతం తాను ఖద్దరు మాత్రమే ధరించారని విద్యార్థులకు తెలిపారు. అనంతరం గ్రామంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో  చేనేతను ప్రోత్సహిద్దాం. మన భారతీయతను, మన సంస్కృతిని కాపాడుకుందాం ఖద్దరు ధరిద్దాం వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.